సొంతగడ్డపై చెన్నైని ఓడించడం అంతా ఈజీ నా అంటే కాదు అనే చెప్పాలి. ఈ రోజు ఐపీఎల్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్యన మ్యాచ్ జరగనుండగా అందరూ ఈ మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఫామ్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో చెన్నై కన్నా కూడా గుజరాత్ టైటాన్స్ చాలా బలంగా కనిపిస్తోంది. అయితే సొంత మైదానంలో చెన్నై కు వెయ్యి ఏనుగులు బలం ఉంటుంది. ఇది ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ అయింది. ఈ సీజన్ లోనూ చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై 7 మ్యాచ్ లు ఆడగా, నాలుగు మ్యాచ్ లలో గెలుపొంది మూడింటిలో ఓటమి పాలు అయింది.
ఎక్కువగా గెలిచే అవకాశాలు చెన్నై కు ఉన్నాయని క్రికెట్ ప్రముఖులు చెబుతున్నారు. మరి నిజంగా చెన్నై సొంతగడ్డపై గర్జిస్తుందా లేదా చూడాలి. ఈ మ్యాచ్ లో గెలిచిన వారు డైరెక్ట్ గా ఫైనల్ కు అర్హత సాధిస్తారు. ఓడిపోయిన జట్టుకు మళ్ళీ అవకాశం ఉంటుంది.