8వ తరగతి విద్యార్థినికి వేధింపులు..టీచర్‌ కు 3 ఏళ్ల జైలు శిక్ష

-

విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది అనంతపురం జిల్లా జిల్లా స్పెషల్ కోర్టు. గత ఏడాది గుత్తి లోని ఓ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు సాలవేముల బాబు అనే టీచర్. క్లాస్ రూం లోనే అమ్మాయిని బలవంతం చేయబోయాడా ఆ కామాంధుడు.

కీచకుడి చర నుండి తప్పించుకొని జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది ఆ విద్యార్థిని. దీంతో దిశ SOS కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు విద్యార్థిని కుటుంబ సభ్యులు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై 354(D), పోక్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై పూర్తి ఆధారాలను స్పెషల్ పోక్స్ కోర్టు కు సమర్పించారు దిశ పోలీసులు. నిందితుడు సాలవేముల బాబుకు 3 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమాన విధించింది స్పెషల్ కోర్టు జడ్జ్. తక్షణం స్పందించడంతో పాటు, నిందితుడికి శిక్ష పడేలా పనిచేసిన దిశ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు బాధితులు.

Read more RELATED
Recommended to you

Latest news