పాఠశాలలో విద్యార్థుల కళ్లముందే మహిళా టీచర్లు తన్నుకున్న ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్లే జుట్టుపట్టుకుని.. చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ల తీరుపై మండిపడుతున్నారు. ఇలాంటి టీచర్ల వల్ల మొత్తం ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు వస్తోందని ఫైర్ అవుతున్నారు.
అసలేం జరిగిందంటే..?
పట్నాలోని కొరియా పంచాయత్ విద్యాలయ్ స్కూల్లో కిటికీ తలుపులు మూయడంపై ప్రధానోపాధ్యాయురాలు, టీచర్ల మధ్య ఘర్షణ మొదలైంది. క్లాస్‌రూమ్‌లోకి వచ్చిన ప్రధానోపాధ్యాయురాలు కాంతి కుమారి గది కిటికీలు మూసివేయాలని అనితా కుమారి అనే టీచర్‌కు చెప్పారు. ఇందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రిన్సిపల్ కాంతి కుమారి క్లాస్రూమ్ నుంచి బయటకు వస్తుండగా.. టీచర్ అనిత ఆమె వెనుకే చెప్పు పట్టుకుని వచ్చి దాడి చేశారు. అనితకు మద్దతుగా మరో టీచర్ కూడా ప్రిన్సిపల్‌పై దాడి చేశారు. గది పక్కనే ఉన్న పొలాల్లోకి వెళ్లి ఈ ముగ్గురు కొట్టుకున్నారు. ఇదంతా విద్యార్థుల కళ్లముందే జరిగింది. అనంతరం పొలాల్లో పనిచేసే కొందరు వీరిని వారించడంతో గొడవను ఆపారు.
#Patna #Bihta #koriya #Panchayat की #शिक्षिका से #परीक्षा ना लेना #सरकार इन्हें आता है #जूतम_पैजार #NitishKumar #Teacher #fight #MiddleSchool pic.twitter.com/ZTI0mbF5YX
— JOURNALIST SARVESH (@sarveshmediaman) May 25, 2023