తమిళనాడు మంత్రి ఇంట్లో IT దాడులు… అధికారుల వాహనాలను ధ్వంసం చేసిన DMK నేతలు… !

ఐటీ శాఖలకు వచ్చిన సమాచారాన్ని బట్టి దేశంలో కొందరి ఇళ్లపై రైడ్స్ చేస్తూ ఉంటారు. అదే విధంగా తాజాగా తమిళనాడులోని విద్యుత్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీ ఇల్లు మరియు ఆఫీస్ లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంలో ఐటీ అధికారులలో ఒక మహిళా అధికారిని డీఎంకే పార్టీకి చెందిన నేతలు ఆడుకోవడంతో ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. అంతే కాకుండా ఐటీ అధికారులు వచ్చిన వాహనాలను సైతం ద్వంసం చేశారట. దీనితో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ తరహా ఘటనలు జరగడం చాలా అరుదు. ఒక ఐటీ డిపార్ట్మెంట్ నుండి అధికారులు రైడింగ్ కు వచ్చారంటే ఎంత హోదా ఉన్న అధికారి అయినా , ప్రభుత్వ సంబంధిత వ్యక్తి అయినా వారికి పూర్తిగా సహకరించాల్సిందే.

 

 

మరి ఈ దాడులలో మంత్రికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు , నగదు లభించాయా అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం తమిళనాడులోని మంత్రికి సంబంధం ఉన్న 50 చోట్ల ఈ దాడులు చేస్తున్నట్లు సమాచారం.