చెన్నై వేదికగా మూడు రోజుల క్రితం జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ లు తలపడడ్డాయి. ఈ మ్యాచ్ లో ఛేజింగ్ సమయంలో జరిగిన ఒక సంఘటన పట్ల మాజీ క్రికెటర్ మరియు యంపైర్ అయిన హార్పర్ కెప్టెన్ ధోనీపై విమర్శలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఛేజింగ్ లో ఇన్నింగ్స్ లో 16వ ఓవర్ ను పతిరాణా తో వేయించడానికి ఎక్కువ సమయాన్ని వృధా చేశాడని హార్పర్ ధోని ని విమర్శించాడు. ధోని లాంటి ఆటగాడు మ్యాచ్ ను గెలవడానికి ఇలా చేయడం కరెక్ట్ గా లేదంటూ ఈయన అభిప్రాయపడ్డారు.
ఈయన మాట్లాడుతూ కొందరు వ్యక్తులు క్రీడా చట్టాలు మరియు క్రీడా స్ఫూర్తి కంటే పెద్దవాళ్ళేమో అని కామెంట్ చేశాడు. ఇక ఈ సంఘ్తనను చూస్తూ నవ్వుకుంటున్న ఆన్ ఫీల్డ్ అంపైర్ లను సైతం విమర్శించాడు.