sampath kumar comments on mallu ravi: మల్లు రవి అత్యుత్సాహంతో ఏదో చేయబోయి ఇరుక్కున్నాడు అని ఫైర్ అయ్యారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. మల్లు రవికి వయసు ఎక్కువ, చాదస్తం ఎక్కువ అని వెల్లడించారు. ఎంపీ మల్లు రవిపై తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్… గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మల్లు రవిపై మండిపడ్డారు.

ఆయన గెలుపు కోసం మా రక్తం దార పోసినం… అలంపూర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇచ్చానన్నారు. ఎంపీ మల్లు రవి అంటే మాకు గౌరవం ఉంది… ఎమ్మెల్యేతో ప్రోటోకాల్ పాటించడం తప్పు కాదని పేర్కొన్నారు. కానీ చెయ్యి పట్టుకొని తీసుకెళ్లడం, ప్రతిపక్ష ఎమ్మెల్యేను మా వాడే అనడం పార్టీ లైన్ దాటినట్లే అవుతుందన్నారు. ఇంటికి వచ్చిన వారిని గౌరవించడంలో తప్పు లేదు కానీ సన్మానాలు చేయడం, ఫోటోలు దిగడం ఏంటీ? ఇదంతా పార్టీ కేడర్ ను ఇబ్బంది పెట్టినట్లే అవుతుందన్నారు.