ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన విధానం వుందన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిలో సమూల మార్పులు తీసుకువస్తామన్నారు. ధరణి విషయంలో ప్రభుత్వం అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. తమకు అనుకూల మీడియాలో బిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి విషయంలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి వలన రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో గ్రామాల్లోకి వచ్చి చూడాలని అన్నారు. కాంగ్రెస్ వస్తే ధరణి ఎత్తివేస్తారని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ధరణి పోర్టల్ లో అనేక లోపాలు వున్నాయని చెప్పుకొచ్చారు. ధరణి ద్వారా గ్రామాల్లో వున్న పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి కాంగ్రెస్ తీసుకువెళ్లిందని వివరించారు. ధరణి రద్దు అయితే పధకాలు రావని ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు అన్వేష్ రెడ్డి.