చంద్రబాబు నివాసం జప్తునకు కోర్టు అనుమతి కోరిన ఏపీ సీఐడీ

-

ఏపీ రాజధాని నగర బృహత్ ప్రణాళిక, ఇన్నర్ రింగ్​రోడ్డు ఎలైన్​మెంట్ మార్చడంలో అవినీతి జరిగిందన్న ఆరోపణతో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిని అటాచ్ చేసేందుకు సీఐడీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్‌) అనుమతి ఉత్తర్వులు పొందేందుకు విజయవాడలోని అనిశా కోర్టులో ఏపీ సీఐడీ దరఖాస్తు దాఖలు చేసింది. మంగళవారం జరిగిన విచారణలో ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు.

ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందు ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. చట్ట నిబంధనల పరిశీలన, తదుపరి వాదనలు వినేందుకు విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయాధికారి ఉత్తర్వులు జారీచే శారు.

చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకులకు చెందిన ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోం శాఖ ఈ నెల 12న ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news