రేపిస్టులను సత్కరించే.. హంతకులను స్వాగతించే పార్టీ బీజేపీ : కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్​గా ఉంటారన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ట్విటర్ ద్వారా కేటీఆర్ ఇటు ప్రజలు.. అటు అధికారులకు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ట్విటర్ వేదికగా కేటీఆర్ ఎంతో మందికి సాయం చేశారు. ఇక ఇదే మాధ్యం వేదికగా ఓవైపు కేంద్ర ప్రభుత్వాన్ని.. మరోవైపు ప్రతిపక్షాలను తరచూ విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై, కేంద్ర మంత్రుల తీరుపై మంత్రి కేటీఆర్ తరచూ విరుచుకుపడుతుంటారు. తాజాగా మరోసారి బీజేపీ నాయకత్వంపై కేటీఆర్ మండిపడ్డారు.

ట్విటర్ వేదికగా మరోసారి కేటీఆర్ ఎన్డీఏ సర్కార్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సంస్కారంలేని మూర్ఖులు అంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు. రెపిస్టులను సత్కరించేవారు.. హంతకులను స్వాగతించేవారని విమర్శించారు. మహాత్మాగాంధీని హేళన చేసేవారు అంటూ దుయ్యబట్టారు. పరీక్షపత్రాలను లీక్‌ చేసి యువత జీతాలతో ఆడుకునేవారని మండిపడ్డారు. క్రీడా ఛాంపియన్‌లను అవమానించేవారని మంత్రి కేటీఆర్ బీజేపీపై ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news