తెలుగు బిగ్‌బాస్‌లో జ్యోతి గెలుస్తుందా… ప్ల‌స్‌లేంటి…!

-

బుల్లితెరపై మంచి టీఆర్పీ రేటింగ్స్ దూసుకుపోతున్న రియాలిటీ షో బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన షోలో ఇప్పుడు 7 గురు సభ్యులు మిగిలారు. ఈ ఏడుగురు సభ్యుల్లో ఒక్కరే బిగ్ బాస్ విన్నర్ గా నిలవనున్నారు. అయితే ఈ ఏడుగురు సభ్యుల్లో బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న సభ్యుల్లో శివజ్యోతి కూడా ఒకటిగా ఉంది. బుల్లితెర మీద తీన్మార్ ప్రోగ్రాంతో ఎంతోమంది అభిమానుల మనసులని దోచుకున్న శివజ్యోతి….ఎలాంటి అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.

బిగ్ బాస్ అభిమానులు కూడా శివజ్యోతిపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. దీంతో ఆమె మొదటి రెండు మూడు వారాల్లోనే హౌస్ నుంచి వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ.. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా మారిపోయింది. మొదటి నుంచి బిగ్ బాస్ ఇచ్చిన ప్రతి టాస్క్ లో పాల్గొంటూ, గెలిచినా..ఓడినా తన శక్తి సామర్ధ్యలకు మించి గేమ్ ఆడింది. ఒకానొక సమయంలో మగ సభ్యులకు కూడా గట్టి పోటీ ఇచ్చి వారిపై పైచేయి సాధించిన సందర్భాలు ఉన్నాయి.

కేవలం టాస్క్ ల్లోనే కాకుండా హౌస్ లో మంచి వ్యక్తిత్వంతో అందరికి ఇష్టమైన సభ్యురాలిగా మారింది. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా అందరితో కలివిడిగా ఉంటుంది. బయట ఎలా ఉంటుందో హౌస్ లో కూడా అలాగే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ నిజాయితీగా వ్యవహరిస్తుంది. అలాగే తనకుండే ఎమోషన్స్, ఫీలింగ్స్ బయటకు వ్యక్తపరుస్తూనే…తన గేమ్ స్ట్రాటజీని వదలకుండా బిగ్ బాస్ హౌస్ లో దూసుకెళుతుంది. ఈ విధంగా తాను బిగ్ బాస్ హౌస్ లో నడుచుకోవడం వల్లే తనకంటే పెద్ద సెలబ్రేటీలు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయినా… జ్యోతి మాత్రం టాప్7 కు చేరుకుంది.

పైగా ప్రాంతీయ అభిమానం కూడా తొడవ్వడంతో శివజ్యోతి నామినేషన్లోకి వెళ్ళిన ప్రతిసారి సేఫ్ అయ్యి వచ్చింది. ఇక ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేకుండా, ముక్కుసూటిగా మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటున్న శివజ్యోతి బిగ్ బాస్ విన్నర్ అయ్యేందుకు అతి దగ్గరలో ఉంది. మొత్తం మీద బిగ్ బాస్ విన్నర్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ శివజ్యోతిలో ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news