ముగిసిన అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ

-

ఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మాజీ ఎంపీ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణ ముగిసింది. ఆయనని రెండు గంటల పాటు విచారించారు ఈడి అధికారులు. విచారణ అనంతరం బయటకు వచ్చిన అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈడి కాంగ్రెస్ నాయకులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. యంగ్ ఇండియా సంస్థకు 20 లక్షలు విరాళం ఇచ్చానని.. అన్ని లెక్కలు ఉన్నాయని, వాళ్ళు రిసిప్ట్ కూడా ఇచ్చారని స్పష్టం చేశారు.

గతంలో ఎంపిగా పనిచేశానని.. తనకు పెన్షన్ కూడా వస్తోందన్నారు. 20 లక్షలు ఎక్కన్నుంచి తెచ్చావని అడిగారని వివరించారు. సోనియా కుటుంబం కోసం ఏ త్యాగానికైనా సిద్దం అన్నారు అంజన్ కుమార్ యాదవ్. కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళను వదిలేస్తారని మండిపడ్డారు. ఈడీ బడుగు బలహీనర్గాలపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. తాను ఏ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ఈడి మరిన్ని వివరాలు అడిగిందని.. వాళ్ళు అడిగిన వివరాలు, పత్రాలు మెయిల్ చేస్తానని చెప్పినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news