బ్రిజ్‌భూషణ్‌కు షాక్.. ర్యాలీకి అనుమతివ్వని యూపీ పోలీసులు

-

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటోన్న బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్​కు యూపీ సర్కార్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 5వ తేదీన అయోధ్యలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి అనుమతి నిరాకరించినట్లు సమాచారం. ఈ ర్యాలీ వాయిదా విషయాన్ని బ్రిజ్‌భూషణ్‌ ఫేస్‌బుక్‌ ప్రకటన ద్వారా వెల్లడించారు.

‘మీ మద్దతుతో గత 28 సంవత్సరాలుగా చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నాను. నా రాజకీయ ప్రత్యర్థులు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. అందుకే జూన్ 5వ తేదీన సాధువుల ఆశీస్సులతో ‘జన చేతన్ మహార్యాలీ’ని నిర్వహించాలనుకున్నాను. అయితే ప్రస్తుతం నాపై నమోదైన కేసును దర్యాప్తు చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ కొన్ని రోజులపాటు దీనిని వాయిదా వేస్తున్నాను’అని తన ప్రకటనలో వెల్లడించారు. సోమవారం అయోధ్యలో ర్యాలీలో పాల్గొంటానని ఇదివరకు బ్రిజ్‌ భూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానికి యూపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news