14 ఏళ్ల క్రితం.. సరిగ్గా ఇదే శుక్రవారం.. కోరమాండల్​ రైలుకు ప్రమాదం

-

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో సహాయక చర్యలు ముగిశాయి. ఇప్పటి వరకు 278 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 900 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ భయానక రైలు ప్రమాదం సరిగ్గా 14 ఏళ్ల క్రితం ఇదే సమయంలో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేస్తోంది. 14 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 13, 2009న ఒడిశాలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది.

ఆ రోజు కూడా శుక్రవారమే. రాత్రి 7.30 నుంచి 7.40 మధ్య ప్రమాదం జరిగింది. అప్పుడు కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌ అత్యంత వేగంతో జైపుర్ రోడ్ రైల్వే స్టేషన్‌ దాటుతోంది. ట్రాక్‌ మార్చుకుంటున్న సమయంలో అదుపు తప్పడంతో రైలు పట్టాలు తప్పి బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంజిన్ మరో ట్రాక్‌ మీద పడిపోయింది. ఆ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు.

ప్రస్తుత ప్రమాదంతో పలు బోగీలు పూర్తిగా దెబ్బతినగా.. కొన్ని బోగీలు సురక్షితంగానే ఉన్నాయి. అయితే, అందులోని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపటివరకు ఏం జరిగిందో తెలీక గందరగోళానికి గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news