జూన్​ 25న లండన్‌లో బోనాల జాతర.. పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

-

తెలంగాణ సంబురం బోనాల పండుగ మరికొన్ని రోజుల్లో షురూ కానుంది. కేవలం తెలంగాణలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వాసులంతా ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే లండన్​లో ఉన్న రాష్ట్ర వాసులు కూడా ఈ సంబురాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో జూన్ 25న బ్రిటన్‌ రాజధాని లండన్‌లో బోనాల జాతర జరగనుంది. వెస్ట్‌ లండన్‌లోని సయన్ స్కూల్ ఆడిటోరియంలో నిర్వహించనున్న లండన్‌ బోనాల జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

రాష్ట్ర పండుగను ఖండాంతరాల్లో ఘనంగా నిర్వహించడమే కాకుండా, మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడానికి టాక్ సంస్థ చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. టాక్ సంస్థ ఆవిర్భావం నుంచి నేటి వరకు అన్ని సందర్భాల్లో వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్సీ కవితకు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల కృతజ్ఞతలు తెలిపారు. వారి ఆలోచలనకు ఆశయాలకు అనుగుణంగా మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడానికి అన్నిరకాలుగా కృషి చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news