మొన్న సత్తెనపల్లి ఇప్పుడు చిలకలూరిపేట టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి

-

గుంటూరు జిల్లా టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీ అధిష్టానానికి ఈ పరిణామాలు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. నిన్న సత్తెనపల్లి.. ఇవాళ చిలకలూరిపేట. మొదటి నుంచి పార్టీ కోసం పని చేసిన కుటుంబాన్ని కాదని.. అప్పటికప్పుడు పార్టీలో చేరిన వారికి బాధ్యతలు ఇవ్వడంతో మరో వర్గం నేతలకు మింగుడు పడడంలేదు. టికెట్ల విషయంలోనూ నేతల మధ్య పంతాలు పట్టింపులతో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.


ఇప్పటికే సత్తెనపల్లి టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నియమించడంపై శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే టీడీపీలో గత కొన్నిరోజులుగా నెలకొన్న పరిణామాలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్తిపాటి చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకించి టీడీపీలో హాట్‌టాపిక్‌గా మారింది.

చిలకలూరిపేట టీడీపీ అభ్యర్ధిగా గత కొంతకాలం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పుల్లారావు స్పందించారు. అసలు చిలకలూరిపేటకు భాష్యం ప్రవీణ్‌కు సంబంధం ఏంటీ అని ప్రశ్నించారు. వలసనేతలకు ఇక్కడేం పని అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. ఫౌండేషన్, ట్రస్టుల పేర్లతో వచ్చే వారిని ఎంటర్‌టైన్ చేయకూడదని అన్నారు . ఇప్పుడు నన హడావుడి చేసి చివరికి చెట్లు ఎత్తేస్తారని మండిపడ్డారు.

అటు సత్తెనపల్లి పంచాయితీకి ఫుల్‌స్టాప్ పడకముందే ఇప్పుడు చిలకలూరిపేట వ్యవహారం తెరపైకి వచ్చింది. మరి ఈ రెండింటిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో….

Read more RELATED
Recommended to you

Latest news