నిన్న సాయంత్రం ఒడిశా రాష్ట్రంలో బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదం ఎంత దారుణమైందో చూస్తే కన్నీళ్లాగవు. దేశ వ్యాప్తంగా సంచలనమ్ సృష్టించిన ఈ ప్రమాదం గురించే అందరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. రైళ్ల ప్రమాదం చరిత్రలో ఇంత ఘోరమైన ప్రమాదం ఇంతకు ముందెన్నడూ జరగలేదని పలువురు భావిస్తున్నారు. కాగా తాజాగా ఈ ఘటనపై ఒడిశా పక్క రాష్ట్రం వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చాలా బాధతో మాట్లాడింది. ఈమె మాట్లాడుతూ ఈ దశాబ్దంలో ఇదే పెద్ద రైల్ ప్రమాదం అన్నారు. మమతా బెనర్జీ గతంలో మూడు సార్లు రైల్వే శాఖకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పారు. రైల్వే శాఖా నా బిడ్డలాంటిది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి కేసులను రైల్వే సేఫ్టీ కమిషన్ కు అప్పగించాలని ఈమె డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనను పునరావృతం కాకుండా ఉండడానికి రైల్వే శాఖకు సరైన సూచనలు మరియు శిక్షణ ఇవ్వాలని ఏమియు ప్రభుత్వానికి సూచించింది.