జాబ్ చేసేవారిలో ఈ సమస్యలు ఉంటాయి.. ఇలా బయటపడండి..!

-

ప్రతి స్టేజ్ లో కూడా మనిషికి ఏదో ఒక సమస్య ఉంటుంది. చదువుకునేటప్పుడు మార్కులు ఉద్యోగం చేసినప్పుడు పని ఒత్తిడి ఇలా ఏదో ఒక సమస్య కలుగుతూనే ఉంటుంది. ఇలాంటివి ఏమీ లేకుండా జీవితమే ఉండదు. లైఫ్ ప్రశాంతంగా సాగుతుందనుకుంటే పొరపాటే. ఏదో ఒక బాధ ఏదో ఒక ఇబ్బంది లైఫ్ లో అలా వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో కొన్ని సమస్యల వలన మనకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. జాబ్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ సమస్యలు వస్తాయి.

వీటిని ఎలా హ్యాండిల్ చేయాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం… చాలాసార్లు టీం వర్క్ చేస్తూ ఉంటాం. ఇలాంటి టైం లో జాగ్రత్త పడాలి. మీ ఐడియాలని మరొకరు కాపీ కొడుతూ ఉంటారు ఒకవేళ కనుక ఎవరైనా ఇలా మీ ఐడియాలని కాపీ కొడతారేమో అని మీకు సందేహం కలిగితే మీ ఐడియాలని డైరెక్టుగా బాస్ కి వెళ్లి చెప్పండి. అందరితోనూ పంచుకోకండి. ఒక్కొక్క సారి వేరే వాళ్ళు చేసే తప్పుకి మనం బలి అవ్వాల్సి వస్తుంది. కొందరు మీపై తప్పులని వేయాలని చూస్తూ ఉంటారు.

ప్రైవేట్ గా మాట్లాడద్దు. తప్పు ఏంటో వాళ్ళని అడగండి దాని గురించి మీకు తెలీదని చెప్పండి. ఇలా మీరు జాగ్రత్తగా డీల్ చేస్తే ఫ్యూచర్‌లోనూ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అలానే ఏవైనా పనులు పూర్తి చేయాలన్నప్పుడు ఏ టైమ్‌ లో చేయాలి అనేది తప్పక తెలుసుకోవాల్సి వుంది. అలా కాకుండా మీరు లేట్ చేస్తే మిమ్మల్ని తప్పుగా చూస్తారు. ఈ విషయంలో కచ్చితంగా మాట పడాలి. ఎవరో చెప్పింది నమ్మద్దు. మీరే స్వయంగా కనుక్కోండి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news