World Food Safety Day : ఆహారం విషయంలో తప్పనిసరిగా ఈ 5 విషయాలని పాటించండి.. లేదంటే ప్రమాదమే..!

-

ఆహారం విషయంలో కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే అనారోగ్య సమస్యలు తప్పవు. చాలామంది ఆహారానికి సంబంధించి తప్పులు చేస్తూ ఉంటారు దానితో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ 7న వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ని జరుపుతారు.

ఈరోజున ఆహారం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. ఆహారం విషయంలో మనం చేసే తప్పులు వలన కొన్ని రకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇటువంటి తప్పులు లేకుండా చూసుకోండి లేకపోతే ఎలర్జీలు మొదలు రకరకాల సమస్యలు తప్పవు.

ఫుడ్ ప్రిపరేషన్:

ఆహారాన్ని వండే సమయంలో కచ్చితంగా తప్పులు చేయకూడదు వంట చేసే ముందు కచ్చితంగా మనం వంట చేసే పాత్రని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన పాత్రలు అయినా సరే మరొకసారి నీటితో తొలుచుకోవాలి. ఎప్పుడూ కూడా పచ్చివాటిని వేరేగా ఉంచుకోవాలి.

స్టోర్ చేసుకునే పద్ధతి:

ఇది చాలా ముఖ్యం ఆహారాన్ని వండుతున్నప్పుడు ఆహార పదార్థాలు పాడైపోయాయా బాగా ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. లేకపోతే ఎలర్జీలు, ఫుడ్ బార్ని డిసీసెస్ వంటివి కలుగుతాయి.

ఆహారాన్ని స్టోర్ చేసుకునే పద్ధతి:

చాలామంది వంట చేసేసాం కదా తిందాంలే అని అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు ఇది నిజంగా ప్రమాదకరం కచ్చితంగా ఆహారాన్ని స్టోర్ చేసుకునే పద్ధతి ఉంది. సరైన విధంగా ఆహారాన్ని స్టోర్ చేసుకోకపోతే దానిలో ఉండే పోషక పదార్థాలు తగ్గిపోతాయి పైగా దానిమీద కీటకాలు లేకపోతే మరేమైనా పడడం వలన ఆహారం పాడవుతుంది దాని వలన రకరకాల సమస్యలు కలుగుతాయి.

ఆహారం యొక్క టెంపరేచర్:

ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఎప్పుడూ కూడా ఆహార పదార్థాలు 75 డిగ్రీల సెల్సియస్ లేదంటే అంతకంటే ఎక్కువ ఉండాలి. ఎప్పుడూ కూడా వండిన ఆహార పదార్థాలు యొక్క టెంపరేచర్ ని సరిగ్గా చూసుకోవాలి.

ఆహారాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి:

ఆహారాన్ని సర్వ్ చేసుకునేటప్పుడు గోరువెచ్చని నీటితో చేతులు కడుక్కోవాలి కనీసం 20 సెకండ్ల పాటు చేయని కడుక్కుని ఆ తర్వాత ఫుడ్ ని సర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడూ కూడా తరుక్కునే కత్తిపీట లేదంటే చాపింగ్ బోర్డు ఇలాంటివి ఏమైనా ఉపయోగించే ముందు ఒకసారి కడుక్కుని ఆ తర్వాత మాత్రమే ఉపయోగించాలి.

ఆహారం పాడవడం:

కొన్ని కొన్ని సార్లు ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి ఆహారం పాడైపోతే వాటిని డిస్పోస్ చేసేయాలి తప్ప వాటిని స్టోర్ చేయకూడదు ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు లేకపోతే రకరకాల సమస్యలు కలుగుతాయి, ఫుడ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news