ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ ?

-

 

తెలంగాణ ముఖ్య నేతలు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావులు ఏ పార్టీలో చేరుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.బీజేపీ, కాంగ్రెస్ లు ఆయనకు గాలం వేసినా ఇంతవరకు ఎవ్వరికి క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ తరపున ఈటల రాజేందర్ బృందం, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ టీం ఇటీవల ఆయనతో చర్చలు జరిపారు.

అయినా.. ఆయన ఏ పార్టీ వైపు మెుగ్గు చూపడం లేదు. అయితే.. తాజాగా రేవంత్‌ రెడ్డి సోషల్‌ మీడియా ఓ వార్తను తెగ వైరల్‌ చేస్తోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఇద్దరూ ఈ నెల 25 వ తేదీన కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. పేర్కొంది. అదే రోజున ప్రియాంక గాంధీ… ఖమ్మం వస్తున్నారని.. అదే రోజున మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని ప్రచారం చేస్తున్నారు. అలాగే, ఖమ్మం నుంచి ఎంపీగా ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నారని కూడా ప్రచారంచేస్తున్నారు. అయితే.. దీనిపై ఎంత మేరకు నిజం ఉందో త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news