BREAKING : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాల తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ముహుర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ రాష్ట్రానికి ఈ నెల 15 న అమిత్ షా, ఈ నెల 25 న జెపి నడ్డా రానున్నారు.
ఈ సందర్భంగా మహా జన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు అమిత్ షా, జెపి నడ్డా. ఈ నెల 15 న ఖమ్మం పార్లమెంట్ లో జరిగే సభకు హాజరు కానున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. ఇక అటు ఈ నెల 25 న నాగర్ కర్నూల్ లో పార్లమెంట్ పరిధి లో జరిగే సభలో పాల్గొననున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా. అయితే.. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చర్చలు చేసే ఛాన్స్ లు ఉన్నట్లు సమాచారం అందుతోంది.