సమాజం ఎంతగానో మార్పు చెందుతున్నా ఇంకా కూడా దేశ వ్యాప్తముగా మావోయిస్టులు తమ కార్యకపలాపాలను కొనసాగిస్తున్నారు. కొందరు మావోయిస్టులు మాత్రం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే… కొందరు రాజకీయ నాయకులు తమ ప్రాభల్యం కోసం మావోయిస్టులను వాడుకుంటున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని భద్రాద్రి జిల్లా లో చర్ల మండలం దేవనగిరి ప్రాంతంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను అరెస్ట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా జిల్లా ఎస్పీ జి వినీత్ తెలియచేశారు. కాగా వినీత్ వారి నుండి జిలెటిన్ స్టిక్స్, ఎలెక్ట్రిక్ వైర్, డిటోనేటర్లు, డ్రోన్ ఇంకా కొంత సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా అరెస్ట్ అయినా ముగ్గురిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కాకపోవడం గమనార్హం.
ఒకరు ఛతీస్ ఘడ్ కాంకేర్ గ్రామానికి చెందిన మడిని దేవా దేవయ్య మరియు కిక్కిడి హు అలియాస్ రా లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.