ఇటీవల ముగిసిన కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. గతంలో లాగా ఈసారి కాంగ్రెస్ అధిష్టానం సిద్దరామయ్యను సీఎంగా ప్రకటించింది. కాగా తాజాగా ఈయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంచెం కఠినంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో సిద్దరామయ్య హామీ ఇచ్చిన ప్రకారం నెలకు 200 యూనిట్ లకంటే తక్కువ విద్యుత్తు ను వాడే వారికి కరెంట్ ఉచితంగా ఇవ్వనున్నారు. అదే విధంగా నెలకు 200 యూనిట్ లకంటే ఎక్కువగా విద్యుత్తు ను వాడే వారిపై కఠినమైన నిర్ణయం తీసుకుంది.
ఆ తర్వాత ఒక్కో యూనిట్ కు రూ. 2 .89 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది అని సిద్దరామయ్య ప్రభుత్వం తెలిపింది. ఇది నిజంగా చాలా మందికి షాకింగ్ అని చెప్పాలి. మరి ఈ నిర్ణయంపై ప్రజల నుండి ఎటువంటి స్పదన వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. సీఎంగా సిద్దరామయ్య ముందు ముందు ఎటువంటి సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు అని కొందరు ఎదురుచూస్తున్నారు.