దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు సాగునీటిశాఖ దినోత్సవం

-

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న ఘనంగా పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుపుకోగా.. ఇవాళ సాగునీటి దినోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై జరగనున్న సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొననున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, విశ్రాంత ఇంజినీర్లు, మేధావులు సమావేశానికి హాజరవుతారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాగు నీటి రంగంలో సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మందితో సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో, ఆయా నియోజకవర్గాల్లో సాగు నీటి రంగంలో జరిగిన ప్రగతిని ఈ సమావేశాల్లో వివరిస్తారు. కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణలో నేడు దాదాపు 85 లక్షల ఎకరాలకు సాగు నీటి సరఫరా జరుపుతూ సస్యశ్యామలం చేసిన తెలంగాణ ప్రభుత్వ కృషిని వివరించేలా సాగునీటి దినోత్సవం కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news