ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో ప్రభుత్వ పెన్షన్ విధానం పై బిల్లు రూపకల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతోపాటు ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 12వ పిఆర్సి అమలు చేయాలని ఇలా ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే.. కొత్త డిఏ అమలుకు ఆమోదం,
రాష్ట్రంలోని కొత్త మెడికల్ కళాశాలలో 706 పోస్టుల భర్తీకి ఆమోదం, జూన్ 12 నుండి 17 వరకు విద్యా కానుక వారోత్సవాలు, జగనన్న ఆణిముత్యాలు పథకం అమలుకు ఆమోదం, ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా 5000 కోట్ల రుణ సేకరణకు అనుమతి, చిత్తూరు డైరీ ప్లాంట్ కి 28 ఎకరాల భూమి, లీజ్ ప్రతిపాదికన ఇచ్చేందుకు అంగీకారం, అమ్మ ఒడి, స్మార్ట్ మీటర్ల బిగింపు, గ్రామీణ ప్రాంతాలలో ఇంటర్నెట్ కోసం 445 కోట్లు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంది.