అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి – దేవినేని ఉమా

అసమర్థత,అవినీతి, అరాచకాలు చేసిన జగన్.. రైతు ద్రోహి అంటూ ఫైర్ అయ్యారు దేవినేని ఉమామహేశ్వరరావు.జగన్ కమీషన్ల కక్కుర్తి ఫలితమే పోలవరం గైడ్ బండ్ కుంగిపోవటం.వైసీపీ హయాంలో నిర్మించిన గైడ్ బండ్ లో అక్రమాల బయట పడకుండా కప్పి పుచ్చుకోవడానికే జగన్ పోలవరం సుడిగాలి పర్యటన ఆంతర్యం అన్నారు దేవినేని ఉమా.

 

4ఏళ్లలో 4సార్లు పోలవరం పర్యటనకు వెళ్లిన సీఎం, చివరి పర్యటనను కూడా మొక్కుబడిగా నిర్వహించారు.గైడ్ బండ్ లో అక్రమాలు బయటపకూడదనే ప్రాజెక్టు వద్దకు మీడియాను కూడా నియంత్రించారని తెలిపారు.

 

పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్ కూడా అంగీకరించినట్లు కేసీఆర్ చెప్పారు.జూలైలో వచ్చే వరదల నుంచి నిర్వాసితుల్ని ఏ విధంగా కాపాడబోతున్నారో జగన్ సమాధానం చెప్పాలి.అసమర్థత,అవినీతి, అరాచకాలతో పోలవరాన్ని అటకెక్కించిన రైతు ద్రోహి జగన్ అన్నారు దేవినేని ఉమామహేశ్వరరావు

.