MLA దుర్గం చిన్నయ్య మందు పార్టీ.. వీడియో రిలీజ్ చేసిన శేజల్

-

BRS MLA దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న శేజల్…ఇందుకు సంబంధించి తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. బిజినెస్ మీటింగ్ అని పిలిచి మందు పార్టీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తనను మందు తాగాలని బలవంతం చేశారని పేర్కొన్నారు. ఈ వీడియోలో ఎమ్మెల్యే తన భార్యతో కలిసి ఉన్న ఫోటోను కూడా చూపించారు.

Bellampalli-MLA-Durgam-Chinnaiah

తాను అనవసరంగా ఆరోపణలు చేయడం లేదన్నారు. కాగా, తనను వేధిస్తున్నాడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఆరోపణలు చేసిన బాధితురాలు షేజల్ దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. దీంతో వెంటనే పక్కన ఉన్నవారు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news