ఈ నెల 23న పట్నా వేదికగా ప్రతిపక్షాల భేటీ.. వన్‌ టు వన్‌ ఫార్ములాపై చర్చ

-

వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ పకడ్బందీ ప్లాన్​ను రూపొందించేపనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే ఈనెల 23వ తేదీన బిహార్​లోని పట్నా వేదికగా విపక్ష నేతలంతా సమావేశం కానున్నారు. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికలో ఓ ముఖ్యమైన ఎజెండాపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అత్యధిక స్థానాల్లో బీజేపీపై ద్విముఖ పోరుకు దిగాలని విపక్షాలు వ్యూహరచన చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు ఈ వ్యూహంలో భాగంగా ప్రాంతీయ పార్టీలు తమకు బాగా పట్టున్న నియోజకవర్గాల్లో బీజేపీపై నేరుగా బరిలోకి దిగుతాయి. ఇక జాతీయ పార్టీలు.. అధికార బీజేపీకి ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, ఆయా జాతీయ పార్టీల అభ్యర్థులను నిలబెట్టనున్నాయి. ఈ ఫార్ములాను తొలుత పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే, ఆచరణలో ఇది సాధ్యమేనా? అన్నదే ఇక్కడ ప్రధాన సమస్య. విపక్ష రాజకీయాలకు హబ్‌గా పేరుగాంచిన పట్నాలో ఈ సమావేశం జరగడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news