Fact Check : తెలంగాణకు 12 కొత్త మెడికల్ కాలేజీలు..అంతా అబద్ధమేనా ?

-

తెలంగాణకు 12 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు అయ్యాయని.. దేశంలో కొత్తగా 50 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని ఓ వార్త సోషల్‌ మీడియా తెగ వైరల్‌ అవుతోంది. అయితే..దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. బీజేపీ చెబుతున్న మాటలు అన్ని అవాస్తవమని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన స్వంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్‌ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతున్నదని..వాస్తవం ఏంటంటే, ఈ ఏడాది నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (NMC) దేశవ్యాప్తంగా 50 మెడికల్‌ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసింది.

ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్‌, ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మెడికల్‌ కాలేజీలతో పాటు మరో నాలుగు ప్రైవేట్‌ కాలేజీలకు NMC అనుమతులు ఇచ్చిందని పేర్కొంది. ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినపుడు, ఆ సంస్థలు అన్ని రూల్స్ & రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు అని ధృవీకరించుకొని అనుమతులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నNMC బాధ్యత.తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 9 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదు. కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి కోరింది కేసీఆర్‌ సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news