తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రారంభం

-

తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష షురూ అయింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 994 పరీక్ష కేంద్రాలను టీఎస్‌పీఎస్‌సీ  ఏర్పాటు చేసింది. మొత్తం 503 పోస్టులకు గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగుతోంది. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

పరీక్షా కేంద్రాల వద్దకు అభ్యర్థులు గంటకు ముందే చేరుకున్నారు. 10.15 నిమిషాలకు అధికారులు కేంద్రాల గేట్లు మూసివేశారు. పలుచోట్ల ఆ సమయం తర్వాత వచ్చిన అభ్యర్థులను వెనక్కు పంపివేశారు. సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోయిన వారు దుఃఖంతో వెనుదిరిగారు.

మరోవైపు ఈ పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ పలు సూచనలు జారీ చేసింది. పరీక్అషలో క్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు ఉంటాయని.. శాశ్వతంగా డిబార్ చేస్తామని టీఎస్‌పీఎస్‌సీ హెచ్చరించింది. పరీక్షలో వాచీలు, హ్యాండ్‌బ్యాగ్స్‌, పర్సులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు చెప్పులే వేసుకోవాలి.. షూ వేసుకోవద్దని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news