చంద్రబాబు వల్ల కానిది… సీఎం కేసీఆర్ చేసి చూపించారని తెలంగాణ ఆర్థిక శాఖ, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సిద్దిపేటలో రూ.63 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి హరీష్ రావుతో కలిసి ప్రారంభించారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.
ఐటీ టవర్ ఏర్పాటుతో ప్రత్యక్షంగా వెయ్యి మందికి, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి 15 అంతర్జాతీయ కంపెనీలు. ఇక ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..సmదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోంది.. తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుందన్నారు.. మరో సారి సీఎం కేసీఆర్ ని గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని పేర్కొన్నారు మంత్రి హరీష్‌రావు. చంద్రబాబుపై మంత్రి హరీష్‌రావు పరోక్ష విమర్శలు. గతంలో ఎందరో పాలించారని వివరించారు. విజన్ 2020 అన్నారు.. హైటెక్ అన్నారు. కానీ వాళ్ళ వల్ల కానిది సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు హరీష్ రావు.