ఢిల్లీలోని రాజ్‌పథ్‌ను తలదన్నేలా అయోధ్యలో రోడ్లు – సీఎం యోగి

-

ధర్మనగరి అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామందిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. రాముడు జన్మించిన ఈ ఊరిలో అతి పెద్ద రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ మందిరాన్ని ప్రారంభించేందుకు చకాచకా పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అయోధ్యను సందర్శించారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌. అక్కడ జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో ప్రముఖ ధార్మిక కేంద్రంగా వెలుగొందబోతున్న రామమందిరం మరింత ఆహ్లాదకరంగా ఉండేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆలయాన్ని విజిట్‌ చేసిన అనంతరం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులతో ముచ్చటించారు. ఎక్కడా రాజీలేకుండా అన్ని రకాల హంగులను ఏర్పాటు చేయాలని సూచించారు. 2024 జనవరిలో అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

YOGI

అయోధ్యలో సుమారు ₹ 32,000 కోట్ల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద మొత్తంలో నిర్మాణాలు జరుగుతున్న దాఖలాలు లేవు.ఒక్క యూపీలోనే ఇంత మొత్తంలో పనులు శరవేగంగా సాగడానికి కారణం ముఖ్యమంత్రి యోగీ. అలాగే అయోధ్య అభివృద్ధిని కేంద్రం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 500 ఏళ్ల తర్వాత రామ మందిరం గర్భగుడి నిర్మాణం జరుగుతుండగా ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా శ్రీరాముడి విగ్రహాలను ప్రతిష్ట చేయనున్నారు. ఈ నేపథ్యంలో న్రపంచం మొత్తం ఆయోధ్యని ఆసక్తిగా తిలకిస్తోంది. అయోధ్యను ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరంగా తీర్చిదిద్దుతామని యుపీ ప్రజలకు సీఎం హామీ ఇచ్చారు.ఈ క్రమంలో తానే స్వయంగా పనులను దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. అయోధ్యకు అనుబంధంగా రహదారులను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో రహదారుల గురించి మాట్లాడిన సీఎం యోగీ ఢిల్లీలోని రాజ్‌పథ్‌ని తలదన్నేలా అయోధ్యలో రహదారులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

వచ్చే ఏడాది జనవరిలో రామాలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే ముందు 21 లక్షల మట్టి దీపాలను వెలిగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా దీపావళికి అయోధ్యలో లక్ష దీపాలను వెలిగిస్తారు. రావణాసురుడిని అంతమొందించిన అనంతరం సీతమ్మతో కలసి దీపావళి రోజులన విచ్చేసిన రాముడికి అప్పట్లో దీపాలతో స్వాగతం పలికారని పురాణాలు చెబుతున్నాయి.ఈ సందర్భగాన్ని తెలియజేస్తూ ప్రతి ఏడాది దీపావళి రోజున అయోద్య పట్టణంలోని ప్రతి ఇంట్లో పెద్ద ఎత్తున దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ సారి ఆలయం ప్రారంభోత్సవానికి ముందుకు సరికొత్త రికార్డును నెలకొల్పుతూ 21 లక్షల మందితో మట్టి దీపాలను వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి ఘాట్, మఠం, ఆలయం, సూర్య కుండ్, భరత్ కుండ్ మరియు ప్రతి ఇంట్లో కూడా పెద్ద ఎత్తున దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news