ఓటీటీలోకి ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’.. ఎప్పుడంటే..?

-

బాలీవుడ్ భాయీజాన్ సల్మాన్‌ ఖాన్‌ – టాలీవుడ్ బుట్టబొమ్మ పూజాహెగ్డే జంటగా నటించిన ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. కోలీవుడ్‌లో వచ్చిన ‘వీరమ్‌’, తెలుగులో వచ్చిన ‘కాటమరాయుడు’ చిత్రాలకు రీమేక్‌గా బాలీవుడ్‌లో ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేశ్‌, భూమిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య వేసవి కానుకగా ఏప్రిల్‌ నెలలో థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను సల్మాన్‌ఖాన్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. జూన్‌ 23 నుంచి జీ5 వేదికగా ఈసినిమా అందుబాటులో ఉందనుందని ఆయన చెప్పారు.

ఈ సినిమా స్టోరీ ఏంటంటే..

భాయిజాన్‌ (సల్మాన్‌ఖాన్‌) ఆత్మరక్షణలో యువకులకు శిక్షణ ఇస్తుంటాడు. అతనికి ముగ్గురు సోదరులు. మంచి అమ్మాయిని చూసి తమ అన్నకు పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి (పూజాహెగ్డే)ని తమ అన్నకు సరైన జోడీగా భావిస్తారు. అయితే, ఆమెకు రౌడీలంటే నచ్చదు. భాగ్యలక్ష్మి కోసం భాయిజాన్‌ కూడా మంచివాడిలా నటిస్తుంటాడు. పాత కక్షల కారణంగా భాగ్యలక్ష్మి కుటుంబానికి రౌడీ అన్న (జగపతిబాబు) నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. మరి రౌడీ అన్న నుంచి భాగ్యలక్ష్మి కుటుంబానికి తెలియకుండా భాయిజాన్‌ ఎలా కాపాడుతూ వచ్చాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news