ఏపీ రాజకీయాల్లో సీఎం పదవి రేసు నడుస్తుంది..ఈ రేసులో జగన్, చంద్రబాబు, పవన్ ఉన్నారు..అయితే ఇక్కడ వేరు వేరుగా రేసు జరిగితే ఇబ్బంది లేదు. ఎవరు గెలిస్తే వారికి సిఎం పదవి వస్తుంది. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ బాబు, పవన్ విషయంలోనే క్లారిటీ లేదు. నెక్స్ట్ గాని వైసీపీ అధికారంలోకి వస్తే జగన్ సిఎం అవుతారు..అక్కడ క్లారిటీ ఉంది.
కానీ టిడిపి, జనసేన పొత్తు పెట్టుకుని గెలిస్తే చంద్రబాబు సిఎం అవుతారా? పవన్ సిఎం అవుతారా? అనేది క్లారిటీ లేదు. మామూలుగా చూసుకుంటే జనసేన కంటే టిడిపికి బలం ఎక్కువ. ఉదాహరణకు జనసేనకు 10 శాతం ఓటు బ్యాంకు ఉంటే, టిడిపికి 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. కాబట్టి పొత్తులో ఎక్కువ సీట్లు టిడిపికే వస్తాయి..అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే గెలిస్తే చంద్రబాబు సిఎం అవుతారు. ఈ విషయం పవన్ కూడా ఆ మధ్య క్లారిటీ ఇచ్చారు. అరాచక పాలన చేస్తున్న జగన్‌ని గద్దె దించడానికి ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని, బలం లేకుండా సిఎం పదవి అడగడం కరెక్ట్ కాదని పవన్ చెప్పుకొచ్చారు. సిఎం పదవిపై ఆశ లేదన్నట్లే పవన్ చెప్పారు.
దీంతో క్లియర్ గా బాబు అని తేలిపోయింది. కానీ పవన్ సిఎం పదవిపై ఆశ లేదని చెప్పడం వల్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. పవన్ సిఎం పదవి వద్దంటే..తాము పొత్తు ఉన్నా సరే ఓటు నోటాకు వేసేస్తామని కొందరు జనసైనికులు చెప్పారు. ఈ క్రమంలో పవన్ ఆలోచనలో పడ్డారు. తాజాగా వారాహి యాత్రలో ప్రజలు అవకాశం ఇస్తే సిఎం అవుతానని అని చెప్పుకొచ్చారు.
పొత్తుల గురించి ఎన్నికల సమయంలో చూసుకుంటామని అన్నారు. అంటే ప్రస్తుతానికి పొత్తులు గురించి పట్టింపు లేదు. జనసేనని బలోపేతం చేసుకోవడమే పవన్ టార్గెట్ గా ఉంది. మరి ఎన్నికల సమయంలో పొత్తు ఫిక్స్ అయితే అప్పుడు సిఎం పదవిపై ఎలాంటి చర్చ ఉంటుంది..గెలిస్తే పదవి ఎవరికి దక్కుతుందనేది చూడాలి.