ఇంట్లోనే ఇలా సులభంగా గిన్నెలని శుభ్రం చేసుకునే లిక్విడ్ ని తయారు చెయ్యచ్చు.. నో కెమికల్స్..!

-

ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో గిన్నెలు తోముకునే లిక్విడ్ ని ఉపయోగిస్తూ ఉంటారు. మనం తిన్న ఆహార పదార్థాలు తాలూక మరకలు వంటివి ప్లేట్లకి గ్లాసులకి ఉండిపోతు ఉంటాయి. ఒక్కొక్క సారి ఎంత బాగా క్లీన్ చేసినా కూడా మరకలు వంటివి ఉండిపోతూ ఉంటాయి. పైగా మనం సరిగ్గా శుభ్రం చేయకపోతే ఆ సామాన్లకి కీటకాలు, బొద్దింకలు వంటివి పడుతూ ఉంటాయి. ఏది ఏమైనా క్లీన్ గా మనం సామాన్లని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. బయట కొనుగోలు చేసే డిష్ వాషర్ల లో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. కొంత మందికి ఇవి పడకపోవచ్చు. వాటి తాలూకా వాసన కూడా ఎక్కువగా ఉంటుంది.

అలా కాకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా డిష్ వాష్ లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం… సులభంగా మనం నిమ్మకాయలతో ఇంట్లో లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు. కెమికల్స్ లేకుండానే ఈ లిక్విడ్ ని తయారు చేసుకోవచ్చు. పైగా నిమ్మకాయలు పిండిని తొక్కలతోనే లిక్విడ్ ని మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ నిమ్మకాయ తొక్కల వలన చాలా లాభాలు ఉన్నాయి. ఈ తొక్కలు దుర్వాసనని కూడా పోగొడతాయి గిన్నెలని ఈజీగా క్లీన్ చేస్తాయి.

ఒక 11 తొక్కల వరకు తీసుకుని ఒక గిన్నెలో ఈ ముక్కలు అన్నిటిని వేసి సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోండి. ఇదంతా బాగా ఉడికాక మిక్సీలో ఈ నిమ్మ తొక్కులను అన్నింటినీ కూడా తురుముకోండి. ఓ గిన్నె లోని ఇదంతా వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి. తర్వాత జల్లెడ పట్టియండి. అరకప్పు వెనిగర్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇందులో వేసుకుని కొంచెం నీళ్లు కూడా పోసుకుని బాగా మరిగించుకోండి. కావాలంటే బేకింగ్ సోడా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దీన్ని ఒక కంటైనర్ లోకి తీసుకోండి. ఇలా గిన్నెలని తోముకోడానికి ఈ లిక్విడ్ ని ఉపయోగిస్తే మరకలు అన్నీ పోతాయి. పైగా కెమికల్స్ వుండవు కాబట్టి చేతులు పాడవ్వవు. అలానే ఘాటైన వాసన కూడా రాదు.

Read more RELATED
Recommended to you

Latest news