తెలంగాణలోని అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం…

-

తెలంగాణ ప్రజలకు గుడ్‌ న్యూస్‌… తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పార్కుల్లో ప్రజలకు ఉచిత ప్రవేశ అనుమతి ఇవ్వాలి. పార్కులను సందర్శించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని సిఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోమవారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా హరిత దినోత్సవం నిర్వహించాలని సూచించారు.

తాగునీటి పండగ, విద్య, ఆధ్యాత్మిక దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఏర్పాట్లపై శనివారం ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, ఆయా విభాగాల ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘మొక్కల పెంపకంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరాయంగా సాగేలా చూడాలి’ అని శాంతి కుమారి స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని కలెక్టర్లు తదితరులను అభినందించారు. హరిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అటవీశాఖ పిసిసిఎఫ్ ఆర్. ఎం.డోబ్రియాల్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news