గోరఖ్‌పూర్‌ అభివృద్ధికి నిధుల వరద సొంత నియోజకవర్గంపై దృష్టి పెట్టిన సీఎం యోగీ

-

ఉత్తర ప్రదేశ్‌ రాష్ర్టాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అహర్నిశలు పాటుపడుతున్నారు. అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నఅ సాంఘిక శక్తులను నిలయంత్రించిన యోగీ…..ప్రగతి పనులపై దృష్టి సారించారు. వారణాసి,అయోధ్య,నైమిశారణ్యం వంటి ధార్మిక కేంద్రాలతో పాటు రాష్ర్టంలోని అన్ని ప్రాంతాలలో సమాన అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారు. ఇటీవల అయోధ్యలో వందల కోట్ల రూపాయల పనులను పర్యవేక్షించిన యోగీ ఇప్పుడు తాను ప్రాతినధ్యం వహిస్తున్న గోరఖ్‌పూర్ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం రూ.2427 కోట్ల రూపాయలతో ఈ నెల 23వ తేదీన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. వరదలు వచ్చేలోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ మేరకు సీఎం యోగీ అధికారులను ఆదేశించారు.

ముఖ్యమంత్రి ప్రారంభించనున్న 35 ప్రాజెక్టుల్లో వరద విభాగం, డ్రైనేజీ విభాగం, వరద విభాగం-2 ద్వారా చేపట్టిన రప్తి, ఘఘ్రా, రోహిన్, గుర్రా నదులకు సంబంధించిన వరద రక్షణ పనుల్లో గరిష్టంగా 24 పనులు ఉన్నాయి.,రాష్ర్టంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. దీనిని ముందుకు తీసుకెళ్తూ ఈ నెల 23న గోరఖ్‌పూర్‌లో 623 జల్ నిగమ్ (రూరల్) ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లాలోని 623 గ్రామాల్లో ఈ ప్రాజెక్టుల వ్యయం దాదాపు రూ.2 కోట్ల నుంచి దాదాపు రూ.8 కోట్ల వరకు ఉంది. పిప్రైచ్, గోరఖ్‌పూర్ రూరల్, చౌరీచౌరా, కాంపియర్‌గంజ్, బన్స్‌గావ్, ఖజానీ, చిలుపర్, సహజ్వా అసెంబ్లీ నియోజకవర్గాల గ్రామీణ ప్రాంతాల ప్రజలు జల్‌ నిగమ్‌ ప్రయోజనాలను పొందుతారు.

Read more RELATED
Recommended to you

Latest news