ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆరు సూత్రాలు నిర్ణయించారు సీఎం జగన్. వైద్య , ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై సీఎం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాలను పాటిస్తూ ఔషధాలను అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించారు. తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతి నెలా పెన్షన్ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అంతే కాదు.. కొత్తగా 108, 104 వాహనాలు సహా బైక్ అంబులెన్స్‌లు కొనుగోళ్ల ద్వారా రోగులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయించారు.
జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి అనే ఆరు సూత్రాలు ప్రాధాన్యాంశాలుగా పని చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈమేరకు మార్గదర్శకాలతో కూడిన ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ వైద్య సేవల అమలుకు సంబంధించి తేదీలతో కూడిన ప్రణాళికను సీఎం ప్రకటించారు.