ఎట్టకేలకు మెగా ఫ్యామిలీలోకి వారసురాలు అతిథిగా అడుగు పెట్టింది అని చెప్పవచ్చు. నిన్న రాత్రి హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్స్ లో అడ్మిట్ అయిన ఉపాసన కామినేని కొణిదెల ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:00 గంటలకు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ బృందం బులెటిన్ విడుదల చేసి మరి అధికారికంగా స్పష్టం చేసింది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు అని పండంటి బిడ్డకు ఉపాసన జన్మనిచ్చారు అని స్పష్టం చేసింది. దీంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పాలి.
2012 లో అంగరంగ వైభవంగా ఉపాసన, రాంచరణ్ ల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరు తల్లిదండ్రులు కాలేకపోయారు. భవిష్యత్తు ప్లానింగ్ కోసం పిల్లలను కనాలనే ఆలోచనలు కూడా దూరం పెట్టిన ఈ జంట ఎట్టకేలకు డిసెంబర్లో ఉపాసన గర్భవతి అని చిరంజీవి ప్రకటించి తమ ఆనందాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి మెగా ఇంటికి వారసుడు వస్తాడా ?వారసురాలు వస్తుందా? అంటూ అభిమానుల సైతం తెగ ఆతృతగా ఎదురుచూసిన విషయం తెలిసిందే. కానీ ఎట్టకేలకు ఈరోజు తెల్లవారుజామున ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చి వారసురాల్ని తమ మెగా ఫ్యామిలీలోకి ఆహ్వానించింది.
ఇక ఉపాసనతో పాటు ఆమె భర్త గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్, అత్తయ్య సురేఖ ,తల్లి శోభన కామినేని అక్కడే ఉన్నారు. మొత్తానికైతే పండంటి బిడ్డకు ఉపాసన జన్మనిచ్చినందుకు అటు మెగా ఫ్యామిలీ ఇటు పలువురు సెలబ్రిటీలు అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఉపాసనకు పుట్టిన బిడ్డ పుట్టుకతోనే ఇంటికి అదృష్టాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.