బాలయ్య పాటకు డ్యాన్స్ ఇరగదీసిన కాజల్, శ్రీలీల.. వీడియో వైరల్

-

టాలీవుడ్​లో హాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల.. తెలుగు సినిమా ఇండస్ట్రీ చందమామ కాజల్.. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నందమూరి నటసింహం బాలకృష్ణతో NBK 108 ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్​ సెట్​లో కాజల్ జాయిన్ అయింది. అయితే ఇటీవలే ఈ సినిమా షూట్‌ సమయంలో ఫైట్‌ మాస్టార్స్‌తో కలిసి అనిల్‌ డ్యాన్స్‌ చేశారు. బాలయ్య పాటకు చిందులేశారు. ఇప్పుడు దానిని బీట్‌ చేస్తూ కాజల్‌ అగర్వాల్​, శ్రీలీల కలిసి సెట్స్​లో బాలయ్య పాటకు స్టెప్పులేశారు. ‘చిలకపచ్చ కోక’ పాటకు డ్యాన్స్ ఇరగదీశారు.

“నేను బాలయ్య పాటకు వేసిన డాన్స్‌కు చూసి ఫీల్​ అయి.. మా హీరోయిన్స్ ఇద్దరూ నా ముందు డాన్స్ చేయడం అస్సలు ఆపడం లేదు” అంటూ క్యాప్షన్​ రాసి.. అనిల్ రావిపూడి ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో కాజల్, శ్రీలీల వేసిన డాన్స్ స్టెప్పులకు అనిల్ రావిపూడి సూపర్ అంటూ విజిల్స్ వేయగా.. ఆ తర్వాత మా డ్యాన్స్​ ఇంకా అయిపోలేదంటూ నాన్​స్టాప్​గా శ్రీలీలా, కాజల్ మరోసారి స్టెప్పులు వేసి అదరగొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news