అట్లాంటిక్‌ జలగర్భంలో శబ్దాలు.. ‘టైటానిక్’ టూరిస్ట్ సబ్మెరైన్ ఆచూకీ లభ్యం!

-

టైటానిక్‌ నౌక శకలాలను చూసేందుకు వెళ్లి అట్లాంటిక్ సముద్రంలో గల్లంతైన టైటాన్‌ అనే మినీ జలాంతర్గామి గాలింపులో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. కెనడాకు చెందిన పీ-8 నిఘా విమానం గాలింపు చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే నీటి అడుగున శబ్దాలను గుర్తించినట్లు అమెరికా కోస్ట్‌గార్డ్‌లోని నార్త్‌ ఈస్ట్‌ కమాండ్‌ పేర్కొంది. మరోవైపు అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ ల్యాండ్ సెక్యూరిటీ మెమోను ఉటంకిస్తూ కెనడా విమానం సముద్రంలో శబ్దాలను గుర్తించిందని అమెరికా పత్రికలు కూడా పేర్కొన్నాయి. దాదాపు ప్రతి 30 నిమిషాలకు ఈ చప్పుళ్లు వస్తున్నట్లు కెనడా విమానం గుర్తించిందని వెల్లడించాయి.

8 రోజుల సాహస యాత్రలో భాగంగా టైటానిక్‌ శకలాలను చూసేందుకు బిలియనీర్లు హమీష్‌ హార్డింగ్‌, బ్రిటిష్‌- పాకిస్థానీ బిలియనీర్‌ షాజాదా దావూద్‌(48), ఆయన కుమారుడు సులేమాన్‌(19)తో పాటు మరో ఇద్దరు సముద్ర గర్భానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సాగరంలో ప్రవేశించిన గంటా 45 నిమిషాల్లోనే సబ్‌మెరైన్‌తో సంబంధాలు తెగిపోయిన విషయం తెలిసిందే. దాన్ని గాలించేందుకు అమెరికా, కెనడాలు పెట్రోలింగ్‌ విమానాలు, నౌకలను రంగంలోకి దించాయి.

Read more RELATED
Recommended to you

Latest news