ఉచితాలు కాదు.. ఉపాధి మార్గం చూపించాలని అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడు వారాహి విజయ యాత్రలో భాగంగా ముమ్మిడివరం వీర మహిళలతో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు వేరుశనగ చిక్కిలు ఇస్తున్నారని.. అవి ఎక్కడో తయారు చేసినవి ఇస్తుండడంతో అవి పాడైపోతున్నాయని అన్నారు. నాణ్యత ఉండడం లేదని ఆరోపించారు.
స్థానికంగా ఉండే స్వయం సహాయక మహిళా సంఘాలకు ఈ చిక్కీలు తయారు చేసే బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఉచితలకు బదులు ఉపాధి కల్పించే మార్గాలు చూపిస్తే రాష్ట్రం అప్పులపాలు కాదని చెప్పారు. అమ్మ ఒడి డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తే పిల్లలకు నాణ్యమైన చదువు రాదని.. నిపుణులైన ఉపాధ్యాయులను నియమిస్తే పిల్లలకు మంచి చదువు వస్తుందని అన్నారు.