తెలంగాణలో ఆషాడ బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో నెలరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ బోనాలతో షురూ అవుతాయి.
ఇవాళ లంగర్ హౌస్ లో నిర్వహించే గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు ఇంద్రకరణ్, ముహమద్ అలీ, తలసాని పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వ రూ. 15 కోట్లు కేటాయించింది.
కాగా, నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది తెలంగాణ అమరుల స్మారకం. ఇవాళ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా మ. 3 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఖైరతాబాద్ చౌరస్తా నుంచి నెక్లెస్ రోడ్డు రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ మధ్య ట్రాఫిక్‌కు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తెలిపారు.