మంచే జరగాలని అందరూ కోరుకుంటారు. చెడు జరగాలని ఎవరు కోరుకోరు కదా.. ప్రతి ఒక్కరు కూడా ఇంటికి మేలు కలిగే పద్ధతుల్ని మాత్రమే పాటిస్తూ ఉంటారు. అంతా మంచే జరగాలని అనుకుంటూ ఉంటారు. ఏమైనా చిట్కాలు ఎవరైనా చెప్తే కచ్చితంగా పాటిస్తూ ఉంటారు. డబ్బు సంపాదన ప్రస్తుతం ఎంత కష్టంగా మారిపోయిందో అందరికీ తెలుసు. ఒక్క రూపాయిని సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి.
కానీ మనం కచ్చితంగా ప్రయత్నం చేస్తే ఏదో ఒక రోజు కోటీశ్వరులు అవ్వచ్చు. ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు. వాస్తు ప్రకారం మనం నడుచుకుంటే కచ్చితంగా సమస్యల నుండి బయటపడొచ్చు. ఈ దిక్కున అద్దం పెట్టారంటే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు పోతాయి డబ్బుని ఆకర్షిస్తుంది. ఇంటి లోపలికి రాగానే ఏదైనా ఒక ప్రదేశంలో బాగా అందంగా కనపడే చోట అద్దం పెట్టండి అది పాజిటివ్ ఎనర్జీని పెంచుతుంది.
ఇంట్లోకి అడుగు పెట్టగానే అర్థం కనపడకూడదు నెగిటివ్ ఎనర్జీ అప్పుడు సంభవించొచ్చు అడుగు పెట్టిన తర్వాత చూస్తే కనిపించాలి. వెంటనే కనబడకూడదు. అదేవిధంగా బయట నుండి వచ్చే వెలుగుని ఇంట్లో నింపేలా అద్దం పెట్టాలి ఈ విధంగా ఇంట్లో అద్దం పెడితే చాలా మంచి జరుగుతుంది. అద్దం ఇంట్లో పెట్టినప్పుడు ఎదురుగా ఏమైనా చెత్త వంటివి అద్దం మీద పడేటట్టు ఉండకూడదు అలానే మంచానికి ఎదురుగా కూడా అద్దాన్ని పెట్టకూడదు. ఈ తప్పులు లేకుండా జాగ్రత్తగా దాన్ని మీరు ఇంట్లో పెట్టారంటే కచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది అంతా మంచే జరుగుతుంది ధనం పెరుగుతుంది.