సెలబ్రిటీలకు డ్రగ్స్ సరఫరా చేశారా.. కబాలి ప్రొడ్యూసర్​ను ప్రశ్నించిన పోలీసులు

-

ఇటీవల డ్రగ్స్ సరఫరా చేస్తూ కబాలి సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే సినిమాల్లో నష్టపోవడంతో చౌదరీ చాలా కాలంగా డ్రగ్స్ డీలింగ్​ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ నేపథ్యంలో ఆయణ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు ఈ వ్యవహారంలో.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో విచారించారు. ముఖ్యంగా టాలీవుడ్, బాలీవుడ్ సినిమా ప్రముఖులకు కేపీ చౌదరి డ్రగ్స్ సరఫరా చేశాడా అనే కోణంలో దర్యాప్తు సాగింది.

ఈ క్రమంలోనే డ్రగ్స్‌ కేసులో సినీ నిర్మాత కేపీ చౌదరి కస్టడీ పూర్తయింది. నైజీరియాకు చెందిన గాబ్రియల్‌, డ్రగ్స్‌ సరఫరాదారు చింతా రాకేష్‌తో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. గోవా, హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీల్లో పాల్గొన్న వారి వివరాలను సేకరించారు. మొబైల్‌ కాల్‌ డేటా, వాట్సాప్‌ చాటింగ్‌ను కేపీ చౌదరి ముందుంచి ఆయన్ను ప్రశ్నించారు. మాదకద్రవ్యాల కొనుగోలు, అమ్మకాలపై ప్రశ్నించారు. కస్టడీ పూర్తయిన నేపథ్యంలో కేపీ చౌదరిని కోర్టులో హాజరుపరచనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news