తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. తెలంగాణ రాష్ట్రంలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు…తెలంగాణలో మరో 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జోగులాంబ గద్వాల, నారాయణపేట, నాగర్ కర్నూల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, యాదాద్రి భువనగిరిలో కొత్త కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది కేసీఆర్ సర్కార్.