నిరుద్యోగులకు శుభవార్త..తెలంగాణలో 1,827 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి ఆదేశాలు

-

నిరుద్యోగులకు శుభవార్త..తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా 1,827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. బోధనాస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా నేరుగా భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

తెలంగాణలో వైద్య విద్యను ప్రోత్సాహించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా 1,827 మంది స్టాఫ్ నర్సులను భర్తీ చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news