తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు..రేపు హైదరాబాద్‌కు జేపీ నడ్డా

-

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటున్న తరుణంలోనే.. బీజేపీ బలం పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే, బిజెపి చేపట్టిన సంపర్క్ సే సంవర్ధన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రేపు హైదరాబాద్ కు రానున్నారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు శంషాబాద్ కు చేరుకోనున్న నడ్డా పలువురు ప్రముఖులను కలవనున్నారు. అనంతరం సాయంత్రం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఇక అటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కాసేపట్లో హైదరాబాద్ నుంచి కిషన్‌ రెడ్డి ఢిల్లీ బయలుదేరనున్నారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నుంచి ఈటల, కోమటిరెడ్డికి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news