సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు పలు యాడ్ లలో పనిచేసిన ఈమె ఆ తర్వాత సినిమాలలో అవకాశాలు దక్కించుకొని.. ఆ తర్వాత తన నటనతో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలోనే కాదు కోలీవుడ్ సినిమాలలో అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోలు అందరి సరసన నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది.
ఇది ఇలా ఉండగా, హీరోయిన్ సమంత తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. రాహుల్ రవీంద్రన్ ఫోటో షేర్ చేస్తూ… ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని 100 సార్లు మల్టీప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్. రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను” అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో నెట్టింట సామ్ మళ్ళీ ప్రేమలో పడిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.