వాగ్నర్‌ గ్రూప్‌ వార్నింగ్.. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న పుతిన్

-

రష్యాలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల మధ్య ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. రష్యా సైనిక నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్న వాగ్నర్‌ గ్రూప్‌ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్‌.. ప్రస్తుతం రొస్తోవ్‌లోని మిలిటరీ కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసి.. తన డిమాండ్లను వెల్లడించారు. ఈ నేపథ్యంలో తిరుగుబాటును కట్టడి చేసేందుకు పుతిన్‌.. తన సేనలకు మరిన్ని అధికారాలు ఇచ్చారు. అలాగే మాస్కోలో ‘కౌంటర్ టెర్రరిజం రెజిమ్‌’ను ప్రకటించారు.

రష్యా దక్షిణ ప్రాంతమైన రొస్తోవ్‌లోని మిలిటరీ కార్యాలయం నుంచి ప్రిగోజిన్‌ విడుదల చేసిన వీడియోలో.. ‘చీఫ్ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్ గెరాసిమోవ్‌, రక్షణ మంత్రి సెర్గీ షొయిగు.. రొస్తోవ్‌ మిలిటరీ కార్యాలయంలో నాతో సమావేశం కావాలి. లేదంటే వాగ్నర్‌ సేనలు మాస్కో వైపు వెళ్తాయి. రొస్తోవ్‌ను దిగ్బంధం చేస్తాయి’ అని హెచ్చరించారు. మరోపక్క రోస్తోవ్‌ నుంచి గెరాసిమోవ్ మిలిటరీ కార్యాలయం నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆ నగరంలోని తన స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లో తలదాచుకోవచ్చని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news