వారికి పెద్ద షాక్.. కేంద్రం కీలక ప్రకటన..!

-

ఉద్యోగులకు కేంద్రం నుండి పెద్ద షాక్ ఏ తగిలింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని అనుకునే వాళ్లకి లేదు అంటే కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకి ఇది పెద్ద షాక్. ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు చూస్తే.. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంతో ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ (హెచ్‌బీఏ) వడ్డీ రేటును పెంచారు.

2022-23 ఆర్థిక సంవత్సరం కంటే ఇది ఎక్కువగా వుంది. గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్‌బీఏ వడ్డీ రేటును మార్చింది. 7.5 శాతంగా వుంది ఇది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఈ కొత్త వడ్డీ రేటు అమలు లో రానుంది. 7.5 శాతం వడ్డీ రేటుతో లోన్ ని పొందవచ్చు. 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌బీఏ వడ్డీ రేటు 7.1 శాతం వుంది.

అయితే నియమాల ప్రకారం అయితే కొత్త ఇల్లు కట్టుకోవడానికి, ప్లాట్ కొనుగోలు, ఇంటి మరమత్తులు కోసం ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ రూపంలో లోన్ అనేది తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు ప్రభుత్వ బ్యాంక్ లేదా హుడ్కో లేదా ప్రైవేట్ బ్యాంకుల ద్వారా లోన్ ని కనుక తీసుకుంటే తిరిగి చెల్లించడానికి కూడా ప్రభుత్వం నుంచి హెచ్‌బీఏ ని తీసుకొచ్చు. ఇప్పుడు వడ్డీ రేటు పెరగడం తో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news